*13 ఏళ్ళ బాలుడి ప్రాణం తీసిన నూడిల్స్..!*
ఆకలితో సగం ఉడికిన నూడిల్స్ తిన్న 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.ఈ విషాద ఘటన ఇటీవల ఈజిప్టులో చోటు చేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు ఆకలిగా ఉన్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా మూడు ప్యాకెట్ల నూడిల్ను ఉడకబెట్టకుండా తిన్నాడు.తర్వాత అతనికి కడుపునొప్పి,వాంతులు రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.