Latest News
నర్మెట ఆయిల్ పామ్ ప్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
16 Sep, 2025
136 Views
నర్మెట ఆయిల్ పామ్ ప్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
త్వరలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం
- తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి నంగునూరు,సెప్టెంబర్ 16(అవనివిలేకరి) సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో దాదాపు రూ.300 కోట్ల ఖర్చు తో నిర్మాణం అవుతున్న ఆయిల్ పామ్ తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి సిద్దమైంది.మంగళవారం తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి నంగునూరు మండలం నర్మెట్ట లో నిర్మాణం పూర్తి అయిన ఆయిల్ పాం ప్యాక్టరీ ఆవరణలో FFB ర్యాంపు ని చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా అయిల్ ఫెడ్ స్టేట్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ ప్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఆయిల్ పామ్ రైతుల కు ఫ్యాక్టరీ ని అందుబాటులో కి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి,మంత్రుల ద్వారా ప్రారంభించనున్న మని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. ఛైర్మన్ వెంట ఆయిల్ ఫెడ్ అధికారులు,ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,ప్యాక్టరీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.