Latest News

పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు

06 Oct, 2025 69 Views
Main Image

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట


దిల్లీ,అక్టోబర్ 06(అవనిప్రతినిధి)సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. మరోవైపు హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈక్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది.