Latest News

పాఠశాలకు మంచినీటి డిస్పెన్సర్ అందించిన పూర్వ విద్యార్థులు*

22 Aug, 2025 110 Views
Main Image

పాఠశాలకు మంచినీటి డిస్పెన్సర్ అందించిన పూర్వ విద్యార్థులు

గ్రంథాలయానికి పుస్తకాల అందజేత

నంగునూరు, ఆగస్టు 22(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాలకు శుక్రవారం తాగునీటి డిస్పెన్సర్ తో పాటు పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలను అందించారు. 1984-85 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు గత నెల 27వ తేదీన నలభై వసంతాల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులకు పాద పూజ నిర్వహించారు. తమకు చదువు చెప్పి చనిపోయిన గురువులతో పాటు, తమతో చదువుకుని మరణించిన విద్యార్థుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి జ్ఞాపకార్థం పాఠశాలకు 1984-85 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు మంచినీటి డిస్పెన్సర్ ను పాఠశాలకు తీసుకెళ్లి అందించారు. పాఠశాల గ్రంథాలయానికి ఆక్స్ ఫోర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ, శంకరనారాయణ డిక్షనరీలు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు త్రిభాషా డిక్షనరీ, రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, ఆర్ ఎస్ అగర్వాల్ వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఆర్ ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకాలు, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను శుక్రవారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొట్టిపర్తి రామస్వామి గౌడ్ కు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని సోషల్ మీడియాలో వృథా చేయకుండా పుస్తకాలను చదవడానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కత్తుల లక్ష్మారెడ్డి, పాతూరి శ్రీనివాసరెడ్డి, వెంకయ్యగారి ధర్మారెడ్డి, గాడిపల్లి రవీందర్ రెడ్డి,బొజ్జ సత్యనారాయణ, యాంసాని వెంకట సురేశ్ కుమార్, దేవులపల్లి పరశు రాములు, దాసరి రాజయ్య, వలపురెడ్డి మల్లారెడ్డి, బూసిరెడ్డి నరోత్తమ రెడ్డి, కత్తుల మల్లారెడ్డి, పాలెపు నర్సింలు, తాళ్ళ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు దుబ్బుడు రవీందర్ రెడ్డి, గిరి తిరుపతి, కన్యాలాల్, కొత్తపల్లి రవి,  నగేశ్, అంబిక, వంశీకృష్ణ, రాంగోపాల్ రెడ్డి, రాజమౌళి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.