Latest News
పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తేమట్టెల పంపిణీ - నేటితో 50 మందికి సాయం
20 Aug, 2025
27 Views
పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తేమట్టెల పంపిణీ
నేటితో 50 మందికి సాయం
జెపి యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు,పి ఎ సి ఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్
సిద్దిపేట అర్బన్,ఆగస్టు 20(అవని విలేకరి) సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అంక్షాపూర్ యాదగిరి గౌడ్ కూతురు పెళ్లి కి అదే గ్రామానికి చెందిన జంపల్లి పరశురాములు జేపీ యాదవ్ పుస్తె మట్టెలు పంపిణీ చేశారు.గ్రామానికి చెందిన జంపల్లి పరశురాములు జేపీ యాదవ్ పుస్తె మట్టెలు పంపిణీ చేయడం నేటితో 50 కుటుంబాలకు అందజేశారు,ఈ సందర్భంగా జెపి యాదవ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని అన్నారు. అనంతరం జెపి యాదవ్ ను గ్రామస్తులు సన్మానిoచారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు పంపిణీ చేయాలని ఆలోచన రావడం అభినందించదగిన విషయం అన్నారు.గత ఆరు సంవత్సరాలుగా జేపీ యాదవ్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె మట్టలు పంపిణీ చేస్తూ నేటితో 50 పూర్తవడం గొప్ప విషయం అన్నారు.తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ విధంగా చేస్తుండం మాకు గర్వకారణం అన్నారు. పేద ఇంటి ఆడబిడ్డల పెళ్ళికి తోడు నీడ గా నిలుస్తూ పుస్తె మట్టలు పంపిణీ చేయడం సంతోషకర విషయం అన్నారు 50 మందికి సహాయం చేయడం నేటితో పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు సన్మానించుకోవడం గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువత తదితరులు పాల్గొన్నారు.