Latest News

ప్రజల మధ్య నిలిచే వారు శతక కవులు - ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

17 Aug, 2025 43 Views
Main Image

ప్రజల మధ్య నిలిచే వారు శతక కవులు


- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 

సిద్దిపేట, ఆగస్టు 17(అవనివిలేకరి) ప్రజల మధ్య నిలిచి, ప్రజల కొరకు పాటుబడేవారు శతక కవులని కవి, రచయిత, శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో యువకవి నల్ల అశోక్ రచించిన సుకృతి శతకం ఆవిష్కరణ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వృత్తి ఉపాధ్యాయులైన ప్రవృత్తిగా రచలు చేస్తున్న నల్ల అశోక్ అభినందనీయులన్నారు. సమాజ శ్రేయస్సుకు సాహిత్యం అవసరం. నాగరికత సారాన్ని తత్వంగా, కవిత్వంగా అందించే సృజనకారులు కవి, రచయితలు ముందునిలుస్తారన్నారు. సమాజంలోని గుండె దరువు సాహిత్యమని, ప్రాచీన పద్య వైభవాన్ని పద్యాలతో అలరించారు. జీవితాన్ని తపస్సులా భావించి సాగే రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని, బాలలకు చిన్నతనంలోనే పద్యాలు నేర్పించాలన్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పద్యం చెదరని సంపదని, నల్ల అశోక్ సుకృతి శతకం చిరస్థాయిగా నిల్చిపోతుందన్నారు. అంకిల్ల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షులుగా పుస్తకావిష్కరణ జరిగింది. బండకాడి అంజయ్య గౌడ్, కంది శంకరయ్య, ఎన్నవెళ్ళి రాజమౌళి, అలాజిపూర్ శ్రీనివాస్, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, మంచినీళ్ల సరస్వతి రామశర్మ, రాజిరెడ్డి మహేందర్ రెడ్డి, దుర్గం శ్రీనివాస్, నల్ల వెంకటేశం, ఎడ్ల జనార్దన్ రెడ్డి, గుండ్ల రాజు, బస్వ రాజ్ కుమార్, బైరి రమేష్ యాదవ్, గోపాలపురం వెంకటేశం, ఎం.డి ఉస్మాన్, పేరబోయిన గణేష్, యాడవరం చంద్రకాంత్ గౌడ్, కనకయ్య, ఎల్లమ్మ, అర్జున్, బాల్ నర్సయ్య, వెంకటేశ్వర్లు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.