Latest News
ప్రజా కవి శివారెడ్డిని పరామర్శించిన విరాహత్
09 Sep, 2025
51 Views
హైదరాబాద్, సెప్టెంబర్ 09(అవనివిలేకరి)సుప్రసిద్ధ ప్రజా కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి కుమారుడు శంభూరెడ్డి రెండు రోజుల క్రితం ఆకస్మిక మృతి చెందారు. కాగా మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, దిల్ సుఖ్ నగర్ గడ్డిన్నారంలోని శివారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. విరాహత్ అలీతో పాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని కిరణ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు శివారెడ్డి ని పరామర్శించారు.