Latest News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

22 Aug, 2025 53 Views
Main Image
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం 
సిద్దిపేట/ హుస్నాబాద్ ఆగస్టు 22(అవనివిలేకరి)పనుల జాతర -2025 కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపుర్ గ్రామంలో 2 కోట్ల తో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం లోపల కలియతిరిగారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు మరియు సిబ్బందికి తెలిపారు. బీపీ చెక్ చేసుకున్నారు. గ్రామ ఎస్ ఎచ్ జీ మహిళలకు స్టీల్ బ్యాంక్ అందజేశారు. స్టీల్ సామాగ్రిని పలు కార్యక్రమాలను ఉపయోగించాలని మహిళలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డీవో రామ్మూర్తి, ఏసిపి సదానందం తదితరులు పాల్గొన్నారు.