Latest News

ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలి

11 Aug, 2025 122 Views
Main Image


సిద్దిపేట ,ఆగస్టు 11(అవనివిలేకరి)  ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి ఆదేశించారు.సోమవారం ఉదయం ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మరియు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు  వైద్య సిబ్బంది హాజరు విషయంలో కొన్ని లోటుపాట్లను గుర్తించడం జరిగిందని ఇకనుండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టి నిర్ణీత సమయం ప్రకారం వైద్యులు మరియు  వైద్య సిబ్బంది విధులకు హాజరై  బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్ రాజ్ ను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,  విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు మరియు ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థలాలలో  సోలార్ సిస్టం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటుంది కాబట్టి  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన భవనాలు స్థలాలకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.వన మహోత్సవం కార్యక్రమం ద్వారా  జిల్లాకు నిర్దేశించిన 22 లక్షల మొక్కలను నాటులలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన  లక్ష్యాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు.         అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్స్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పర్యటించి వారి శాఖకు సంబంధించి క్షేత్రస్థాయి వరకు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో  అందించే ఆహార పదార్థాల నాణ్యతను  సంబంధిత శాఖల ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, కలర్ కోడింగ్ ద్వారా కూరగాయలను వేరుచేసి విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. అధికారులు కూడా అక్కడ భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు