Latest News
బజరంగ్ యూత్ మహాగణపతి శోభాయాత్ర..
06 Sep, 2025
104 Views
బజరంగ్ యూత్ మహాగణపతి శోభాయాత్ర..
కొండపాక సెప్టెంబర్ 6 (అవని విలేకరి)మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గొల్లపల్లి రమేష్ శర్మ నేతృత్వంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం శనివారం శోభాయాత్రను అంగరంగ వైభవంగా భక్తులు కోలాటాలతో, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి రమేష్ శర్మ మాట్లాడుతూ...శ్రీ అయోధ్యుడి బలరాముని రూపంలో ఈసారి గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న మహా గణపతి నిమజ్జన ప్రక్రియను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులుతీరారు. దీంతో దుద్దెడ నడిబొడ్డున హనుమాన్ నగర్ ప్రాంతం జన సందోహంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ సభ్యులు వడ్లకొండ రాకేష్, బుచ్చి గారి ప్రశాంత్, మీసం శ్రీనివాస్, నర్ర మహేందర్ రెడ్డి, పంజాల నరేష్ గౌడ్, చిలుముల సందీప్ పాల్గొన్నారు.