Latest News

బహుజనులను ఏకం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న

18 Aug, 2025 26 Views
Main Image

బహుజనులను ఏకం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న

- కోల రమేశ్ గౌడ్, నంగునూరు పీఏసీఎస్ ఛైర్మన్ 

నంగునూరు, ఆగస్టు 18(అవనివిలేకరి)గోల్కొండను స్వాధీనం చేసుకొని సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో బహు జనులను, కులవృత్తులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని నంగునూరు పీఏసీఎస్ ఛైర్మన్ కోల రమేశ్ గౌడ్ అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో సోమవారం  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  375 వ జయంతిని నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నంగూనూరు గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు జాగీరు ఎల్లగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పీఏసీఎస్ చైర్మన్  కోల రమేశ్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోల మహేందర్ గౌడ్, కోల శ్రీధర్ గౌడ్, కోల ఉమాకర్ గౌడ్, బూరుగు నర్సిములు గౌడ్, కోల యాదగిరి గౌడ్, ఖాతా నర్సిములు గౌడ్, ముష్మీర్ పరశు రాములు గౌడ్, కోల సతీష్ గౌడ్, గోనేపల్లి శివగౌడ్, శ్రీనివాస్ గౌడ్, గోనేపల్లి సిద్దేశ్వర్ గౌడ్, కృష్ణ, వంశీ, రాము, కోల కనకయ్య గౌడ్, బూర్ల  శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.