Latest News
భవనాల నిర్మాణాలకు 2.కోట్ల 40 లక్షల నిధులు మంజూరు - మాజీ మంత్రి హరీష్ రావు
21 Aug, 2025
122 Views
భవనాల నిర్మాణాలకు రూ.2.కోట్ల 40 లక్షల నిధులు మంజూరు...
- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట,ఆగస్టు 21(అవనివిలేకరి)సిద్దిపేట నియోజకవర్గం లో 10 అంగన్ వాడి భవనాలకి మరియు 8గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ. 2.కోట్ల 40 లక్షలు మంజూరు అయినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కొత్త గా ఏర్పడిన గ్రామ పంచాయతీ లకు భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు..కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, అదే విధంగా అద్దె భవనాల్లో నే అంగన్ వాడి స్కూల్స్ నడిస్తున్నాయని, ఇటు కిరాయి చెల్లించని పరిస్థితి మరో వైపు భవనాలు సరిగా లేక ఇబ్బందదులు ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం లోనే ప్రతిపాదనలు పంపగా వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి.. సిద్దిపేట నియోజకవర్గం లో కొత్తగా ఏర్పాటు అయిన గ్రామ పంచాయతీలు 8 గ్రామ పంచాయతీ లకు 20లక్షల చొప్పున రూ. 1కోటి 60లక్షలు మంజూరు అయ్యాయి.సిద్దిపేట రూరల్ మండలం లోని సీతారాం పల్లి, బచ్చాయి పల్లి, సిద్దిపేట అర్బన్ మండలం లో బక్రీ చెప్యాల, బొగ్గులోని బండ, చిన్నకోడూరు మండలం లోని ఎల్లమ్మ జాలు, కమ్మర్ల పల్లి, నంగునూర్ మండలం లో బద్దిపడగ, సంతోష్ నగర్, నారాయణ రావు పేట మండలం లో శేఖర్ రావు పేట గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు..సిద్దిపేట నియోజకవర్గం లో 10 అంగన్ వాడి భవనాల నిర్మాణాలకు రూ. 8లక్షల చొప్పున రూ. 80లక్షల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు.. సిద్దిపేట రూరల్ మండలం లోని పుల్లూరు, ఇర్కోడ్ గ్రామాల్లో, సిద్దిపేట అర్బన్ మండలం లోని బూరుగుపల్లి మందపల్లి గ్రామాల్లో, చిన్నకోడూరు మండలం లోని మేడిపల్లి, రామంచ 1,నంగునూర్ మండలం లోని మగ్గుదంపూర్, బద్దిపడగ గ్రామాల్లో, నారాయణ రావు పేట మండలం లోని నారాయణ రావు పేట, జక్కపూర్ ( శనిగే కుంట) గ్రామాల్లో నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.