భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్..
కొండపాక సెప్టెంబర్ 10 (అవని విలేకరి)అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ ప్రతిష్టమైందని భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్లు శ్రీకాంత్, సేల్స్ ఆఫీసర్ తిరుపతి తెలిపారు. మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో బుధవారం పార్వతీ పరమేశ్వర ఏజెన్సీ కాంతారావు ఆధ్వర్యంలో బిల్డర్లు, మేస్త్రీలకు సిమెంట్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ... భారతి సిమెంట్ రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతోందన్నారు. అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అయితే భారతి అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లోనే సెట్ అవుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి, కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం 100 మంది మేస్త్రీలకు భారతి మిత్ర స్కీం క్రింద రూ. లక్ష ఉచిత బీమా బాండ్ అందజేశారు. తర్వాత మేస్త్రీలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ ఇరువల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.