Latest News

మెడికల్‌ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

08 Oct, 2025 54 Views
Main Image

మెడికల్‌ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

అక్షరను అభినందించిన ఎస్‌.సి, ఎస్‌.టి. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (అవనివిలేకరి)నగరానికి చెందిన యాతాకుల అక్షర మెడికల్‌ రెండవ దశ నీట్‌ కౌన్సిలింగ్‌లో ఎంబీబీఎస్‌ సీటు సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తన కార్యాలయంలో అక్షరను సన్మానించి, ఆమె తల్లిదండ్రులైన అశోక్‌ - ఉపేంద్రలను అభినందించారు. అక్షరను భవిష్యత్తులో సమాజానికి, ముఖ్యంగా పేదలకు సేవ చేయగల డాక్టర్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.అక్షర తల్లిదండ్రుల కల నిజమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన వెంకటయ్య, ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.మల్లారెడ్డి వైద్య కళాశాలలో మెడికల్‌ సీటు సాధించిన అక్షరను  యూసఫ్‌ బాబు, జగదీశ్వర్‌ రెడ్డి, గుండం రాజా మహేందర్‌ రెడ్డి, అన్నారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు మరియు బంధువులు, సన్నీహితులు  స్నేహితులు  అభినందించారు.