Latest News

మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేస్తాం

20 Aug, 2025 44 Views
Main Image
మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేస్తాం
- పిసిసి అధ్యక్షుడు బొమ్మ.మహేష్ కుమార్ గౌడ్ 
హైదరాబాద్,ఆగస్టు 20(అవనివిలేకరి)తెలంగాణ రాష్ట్రం లో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో  మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చట్టం చేస్తామని పిసిసి అధ్యక్షుడు,యం ఎల్ సి బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.హేతువాదినరేంద్ర దబ్బోల్కర్ వర్ధంతి, జాతీయ సైంటిఫిక్ టెంపర్ డే పునస్కరించుకొని.   మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి అధ్వర్యంలో మూఢనమ్మకాలు నిర్మూలన చట్ట సాధన స పై చర్చా గోష్టి ని బుధవారంనాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ హల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధిగాగా హజరైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ మూఢనమ్మకాల  నిర్మూలన ముసాయిదా చట్టాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఎంతో అవసరం వుందన్నారు. నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత చదువులు చదివిన వారే మూఢనమ్మకాల భ్రమలో వున్నారన్నారు.ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో జాతీయ స్ధాయి లో చట్టం చేయాలని డిమాండ్ చెసినందున అది మాకు ఆదేశం అయినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి చట్టం చెస్తామని అన్ని పార్టీలు కూడ మద్దతు ఇస్తారని ఆశించారు.కాంగ్రెస్, కమ్యూనిస్టు లు కలిసి మతోన్మాదాన్ని అడ్డుకొవాల్సిన అవసరం వుందన్నారు.ఎన్నికల సమయంలో నే రాజకీయాలు అని తర్వాత అభివృద్ధి పై కలిసి పనిచేయాలన్నారు.విద్య,ఆరోగ్యం పై ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ మూఢనమ్మకాలు సమాజాన్ని పట్టిపిడిస్తుందన్నారు.సమాజంలో చైతన్యం పెరిగేకొద్ది మూఢనమ్మకాలు పెరుగుతున్నాయన్నారు.బాణమతి,మంత్రాల పేరుతో ఎస్సీ ,బిసిలను సజీవ దహనం చేస్తున్నారన్నారు.తొమ్మిది రాష్ట్రాలలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు చేసినందున తెలంగాణ లో కూడ చట్టం చేయాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సియం లకు నివేదిక సమర్పిస్తామన్నారు.రాష్ర్ట గ్రంధాలయ సంస్ధ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూదేశంలో సైంటిఫిక్ టెంపర్ ను  మొదటి ప్రధాని నెహ్రు పెంపొందించారన్నారు. కాంగ్రెస్ సొషలిష్టు దేశంగా మార్చేందుకు పని చెస్తుందన్నారు. బిఅర్ ఎస్  మాజీ ఎమ్మెల్సి కర్నే ప్రభాకర్ మాట్లాడుతు  ప్రభుత్వం చట్టం తీసుకరావాలని మా పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తునె  మూఢనమ్మకాలను వ్యతిరేకించాలన్నారు. సిపియం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యలు అబ్బాస్ మాట్లాడుతూ  ఎఐ సాంకేతిక పరిజ్ఞానం తో మూఢ విశ్వాసాలను ప్రచారం చెస్తున్నారన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కొసం పొరాడుతమన్నారు.ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమక్రసి రాష్ట్ర నాయకులు ఝాన్సీ, సిపిఐ యం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు సదానందం, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర శ్రీ నివాస్,మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ రమేష్ , మానవ వికాస సమితి కేంద్ర నాయకులు సాంబశివరావు,దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, కులనిర్మూలన సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు వహిద్,జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్య లక్ష్మీ, విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షుడు అదామ్ రాజ్,వివిధ సంఘాల నాయకులు గుత్తా జొస్నా, స్కైలాబ్,అనసూయ, స్వరూప, అనురాధ,జ్యోతి,కృష్ణ చంద్ ,రవి తేజ,జాన్ తదితరులు పాల్గొన్నారు.