Latest News

మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలి

22 Aug, 2025 43 Views
Main Image
మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలి
-శ్రీను, సిద్దిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్. 
నంగునూరు, ఆగస్టు 22(అవనివిలేకరి)యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడమే కాక వాటి నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలని సిద్ధిపేట రూరల్ సిఐ శ్రీను అన్నారు. రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలోని యువతను డ్రగ్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రోత్సహించేందుకు క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇంట్లో భాగంగా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో టోర్నమెంటును సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీను మాట్లాడుతూ  యువతరాన్ని  డ్రగ్స్ కు దూరంగా, చెడు వ్యసనాలు వీడి ఆటలు, మన సంస్కృతి వైపు మళ్ళించడం కోసం ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని  వివిధ గ్రామాలకు చెందిన 24 క్రికెట్ టీములు, 10 వాలీబాల్ టీములు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని చెప్పారు. డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషిచేసి డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు సూచించారు.సిద్దిపేట జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా  మార్చే కార్యక్రమంలో యువకులది కీలక పాత్ర అన్నారు. డ్రగ్స్ వల్ల సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలను వివరించారు. యాంటి డ్రగ్ సోల్జర్ యాప్ ను పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ ఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు.యువత డ్రగ్స్ తీసుకోవద్దని, ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.డ్రగ్స్ సంబందించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కు పోన్ ద్వారా తెలియజేయాలని కోరారు. సందర్భంగా టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులతో"నేను  మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను" అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాలపేట ఎస్ఐ వివేక్, వివిధ గ్రామాల క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.