మెదక్ లో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాకు హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి.
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రైతు మోసాలపై జంగ్ సైరన్
మెదక్, ఆగస్టు 07(అవనివిలేకరి) క్కాం గ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలో జిల్లా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు రైతులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మాజీ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలోమాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడు తూ ఎన్నికల్లో ఇచ్చినా హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నన్నారు , గ్యారెంటీలు, 420 హామీలు ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి నైజం బయట పడింపడిందని, పరిపాలన రావడం లేదన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందెందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బూచి గా చూపుతున్నారన్నారునర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ రైతు ను గౌరవంగా నిలబెట్టింది కెసిఆర్ అన్నారు.రైతు కు మద్దతు ధర, బోనస్ ఇవ్వాలని అడుక్కునే దుస్థితి కాంగ్రెస్ పాలన లో ఉందన్నారు. రైతు సమస్యలపై కేటీఆర్ చర్చ కు వస్తే సీఎం రేవంత్ ఢిల్లీలో దాక్కున్నారన్నారు.పంట నష్టానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కెసిఆర్ 24గంటల కరెంట్ ఇచ్చారు.. ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.రైతు బీమా కెసిఆర్ సర్కార్ ఇస్తే కాంగ్రెస్ సర్కార్ ప్రీమియం ఇవ్వడం లేదన్నారు.ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రన్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ అంటేనే రైతుల అడ్డా రైతులకు ఎరువులు దొరకడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక చాలా సంతోష పడ్డాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అన్నీ బాగుచేశాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కు మాలిన మంత్రి.మెదక్ జిల్లా ప్రాజెక్ట్ ల మీద ఉత్తమ్ వివక్ష చూపుతున్నారు.జిల్లా మంత్రి దామోదర్ పనికిమాలిన మంత్రి అని విమర్శించారు.ఇంట్లో కూర్చొని కమిషన్లు దండుకుంటున్నారు. జిల్లా ఇంచార్జీ మంత్రి కి మెదక్ జిల్లా గురించి ఎం తెలుసునని ప్రశ్నించారుదేశంలో ఏ రాష్ట్రంలో లేని పాలన తెలంగాణ లో కొనసాగుతుంది.మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ,మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు మాట్లాడారు