సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో వరదరాజుపల్లి,గుడికందుల,గోవర్ధనగిరి గ్రామస్థుల ధర్నా..
సిద్ధిపేట,అర్బన్,ఆగస్టు22 (అవని విలేకరి)సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో వరదరాజుపల్లి,గుడికందుల,గోవర్ధనగిరి గ్రామస్థుల శైక్రవారం ధర్నా చేపట్టారు. కమీషనర్ డౌన్ డౌన్ దొంగల రాజ్యం.దోపిడి రాజ్యం అంటు నినాదాలు చేశారు, కమీషనర్ చాంబర్ ముందు బైఠాయించి ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం నిరసన తెలిపారు.వరదరాజుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సిద్దిపేట డంపుయార్డుతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చెరువులో చెత్త వేయడంతో చేపలు మృతి చెందాయని ఈ సమస్య విన్నవించడానికి వచ్చిన గ్రామస్తులతో కమీషనర్ దురుసుగా ప్రవర్తించాడని. సమస్య వినకుండా మీరు ఏంచేసుకుంటారో చేసుకోండని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆగ్రహించి కమీషనర్ చాంబర్ ముందే బైటాయించి ధర్నా చేశారు. తమ సమస్య చెప్పడానికి వస్తే కమీషనర్.తన చాంబర్ లోనికి రానివ్వకుండా తన సిబ్బందితో తోపించాడని, కమీషనర్ దురుసు సమాధానం ఏంచేసుకుంటారో చేసుకోండి అని చేప్పడం వారిని తీవ్ర ఆవేధనకు గురి చేసింది. కమీషనర్ వ్యవహరించిన తీరు తో కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య ను ఎంపి రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించి కమీషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని తెలపడంతో వారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు, చివరకు మున్సిపల్ కమీషనర్ దిగివచ్చి గ్రామస్తుల వినతి పత్రం స్వీకరించారు.