Latest News

మోయ తుమ్మెద వాగును పరిశీలించిన కలెక్టర్*

20 Aug, 2025 64 Views
Main Image
మోయ తుమ్మెద వాగును పరిశీలించిన కలెక్టర్
నంగునూరు,ఆగస్టు 20(అవనివిలేకరి)నంగునూరు మండలంలోని మోయ తుమ్మెద వాగుపై ఘనపురం గ్రామం, ఖాతా గ్రామంలోని చెక్ డ్యామ్ లు లో లెవెల్ వంతెనలను బుధవారం జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పది రోజులుగా నీరు చెక్ డ్యామ్ నుండి ప్రవహిస్తోందని, ఇక్కడ నుండి కోహెడ మండలం మీదుగా లోయర్ మానేరు డ్యామ్ లోకి నీరు వెళ్ళుతోందని రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. వర్షపాతం పెరిగితే లో- లెవెల్ వంతెన పైనుండి నీరు వెళతాయని ఆ సమయం రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలని  రెవెన్యూ సిబ్బందికి సూచించారు.  వంతెన కింది భాగంలోని పైప్ లలో గడ్డి తుంగ తొలగించాలని చెప్పారు. చెత్త చెదారం చేరకుండా చూసుకోవాలని ఆదేశించారు.