Latest News
మర్పడగ మల్లికార్జునుడికి అన్నాభిషేకం
21 Aug, 2025
53 Views
మర్పడగ మల్లికార్జునుడికి అన్నాభిషేకం
కొండపాక,ఆగస్టు 21(అవనివిలేకరి)కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాస శివరాత్రి,పురస్కరించుకుని గురువారం నాడు సంతాన మల్లికార్జున స్వామి వారికి అన్నాభిషేకం క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో నిర్వహించారు.ఉదయం 6.30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లఘున్యాస పూర్వకంగా సంతాన మల్లికార్జున స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి అన్నాభిషేకం నిర్వహించారు.తర్వాత అన్నప్రసాద వితరణ చేశారు.