Latest News

మావోయిస్టు అగ్రనేత మోడం బాలకృష్ణ కడసారి చూపుకై తరలివచ్చిన అభిమానులు..

15 Sep, 2025 218 Views
Main Image

మావోయిస్టు అగ్రనేత మోడం బాలకృష్ణ కడసారి చూపుకై తరలివచ్చిన అభిమానులు..


 బాలకృష్ణకు నివాళులర్పించిన ప్రజా సంఘాలు.


 -అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి.


మేడ్చల్ మల్కాజ్గిరి/ సెప్టెంబర్ 15( అవని విలేఖరి)పీడిత ప్రజా నాయకుడు సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ మోడం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ చతిస్గడ్ రాష్ట్రంలో అబూజ్మాడ్ అడవుల్లో పదిమంది మావోయిస్టులతో పాటు మేడం బాలకృష్ణ పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. కాగా ఆయన పార్దివ దేహాన్ని హైదరాబాద్ అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన అంతక్రియలకు బేవరేజ్ మాజీ కార్పోరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ,రాజకీయ విడుదల కమిటీ నాయకులు బల్ల రవీంద్రనాథ్ ,హైకోర్టు న్యాయవాది ఉదయగిరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు, విప్లవ విరసం నేతలు, పౌర హక్కుల సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమ నేతలు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు సంధ్య, అరుణోదయ సంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క, బిఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా కళాకారులు తెలంగాణ వాదులు పాల్గొని మోడం బాలకృష్ణకు విప్లవ నివాళులు అర్పించారు. నిరుద్యోగం ఉన్నంతవరకు విప్లవాలు ఆగవని ప్రజల మధ్య ఉంటాయని బూటకపు ఎన్కౌంటర్లలో తెలంగాణ వాదులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని పలువురు ఉద్యమకారులు మండిపడ్డారు. మోడం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు పటేల్, సుధాకర్ రెడ్డిలు, ముషీరాబాద్ సెంట్రల్ జైళ్లు రాజకీయ ఖైదీలుగా ఉంటూనే కాలరాయబడిన ఖైదీల హక్కుల కోసం ఉద్యమించారని వారి త్యాగం తెలంగాణ సమాజం ఉన్నంతవరకు ఉంటుందని అన్నారు. పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడం బాలకృష్ణలు భగత్ సింగ్ రాజ్ గురు సుద్దేవులు లాహుర్ సెంట్రల్ జైళ్లు ఉరి తీయబడితే ఈ ముగ్గురు వీర యోధులు బూటకపు ఎన్కౌంటర్లలో తమ ప్రాణాలను వదిలారని వక్తలు కొనియాడారు. ఈ ముగ్గురి వీర యోధులు విద్యార్థి దశ నుండి నేటిదాకా వయసు మీద పడిన ప్రాణాన్ని లెక్కచేయకుండా వర్గ పోరాటమే ధ్యేయంగా దోపిడీ ఆర్థిక అసమానతలు సమసమాజ స్థాపన కోసం తమ ప్రాణాలను కోల్పోయారని  ఉద్ఘటించారు. లాహుర్ సెంట్రల్  జైళ్లు జతిన్ దాస్ 63 రోజులు కటోరమైన ఆమర నిరాహార దీక్ష చేస్తూ నిరాహార దీక్షలోనే తుది శ్వాస విడిచారని జతిన్ దాస్ జైళ్లు ఖైదీల పోరాటాలకు ప్రేరణ కల్పించారని గుర్తు చేశారు. ముషీరాబాద్ సెంట్రల్ జైళ్లో 1995లో ఖైదీల హక్కుల కోసం నిరాహార దీక్షలు ఆందోళనలు ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రేరణ కల్పించాలని ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా హోటా చట్టానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలను నిర్వర్తించారని గుర్తు చేశారు. మేడం బాలకృష్ణకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన పార్థివదేహాని వద్ద రెడ్ సెల్యూట్ అంటూ జోహార్లు అర్పించారు. గతంలో మేడం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డిల పోరాటాలను గుర్తు చేసుకుంటూ విప్లవ సంఘాల నేతలు కన్నీరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వందల సంఖ్యలో మేడం బాలకృష్ణ అభిమానులు మావోయిస్టు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ వీర యోధుడికి నివాళులు అర్పించారు. విప్లవ పాటలతో ఆ ప్రాంతం మారుమోగింది.