Latest News
మావోయిస్టు అగ్రనేత మోదెం బాలకృష్ణ 42 యేండ్ల ప్రస్థానం
12 Sep, 2025
225 Views
మావోయిస్టు అగ్రనేత మోదెం బాలకృష్ణ 42 యేండ్ల ప్రస్థానం
సిద్దిపేట,సెప్టెంబర్ 12(అవనివిలేకరి)ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్లాలో జరిగినఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మోడెం బాలకృష్ణ దాదాపు 42 సంవత్సరాలపాటు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు.బాలకృష్ణను మొట్టమొదటిసారిగా భద్రాచలం ప్రాంతంలో పనిచేసే క్రమంలో 1984లో అరెస్టు చేసినారు. రెండు ఏండ్లు వరంగల్ సెంట్రల్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నాడు మళ్లీ 1987లో మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు మళ్లీ అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో మూడు సంవత్సరాల పాటు జైళు జీవితం గడిపాడు. జైళు నుంచి విడుదలైన అనంతరం దక్షిణ తెలంగాణ రీజినల్ కమిటీ మెంబర్ గా అనేక ఉద్యమాలు గెరిల్లా రైతాంగ పోరాటంలో చురుకైన పాత్రను నిర్వహించాడు. 1988లో ఉమ్మడి మెదక్ జిల్లా లో మేడం బాలకృష్ణ పీపుల్స్ వార్ ఉద్యమం నిర్మించడంలో పాత్ర ఉంది. అప్పటి పీపుల్స్ వార్ నేతలు డాక్టర్ అంకం బాబురావు ,సముద్రుడు, ఓరుగంటి సుదర్శన్, శాఖమూరి అప్పారావు భాను ప్రసాద్, దుబాసి శంకర్లతో కలిసి ఉద్యమ నిర్మాణానికి బాటలు వేశారు. మళ్లీ మరోసారి అరెస్ట్ అయి ఆరు సంవత్సరాల పాటు జైల్లో రాజకీయ ఖైదీగా ఉంటూనే జైళ్లు సమస్యలపై ఖైదీల సమస్యలపై రాజకీయ ఖైదీల సమస్యలపై ఉద్యమాలను జైళు నాలుగు గోడల మధ్య నిర్మించాడు. మోడం బాలకృష్ణతోపాటు శాఖమూరి అప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ సూర్యం మేడం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ బాలన్నలు పని చేశారు ముషీరాబాద్ సెంట్రల్ జైళ్లు రాజకీయ ఖైదీలు శాఖమూరి అప్పారావు పటేల్ సుధాకర్ రెడ్డి మోడం బాలకృష్ణాలు పీపుల్స్ వార్ రాజకీయ ఖైదీల హక్కుల కోసం గలమెత్తి నినాదించారు. మార్కిజం భావజాలాన్ని విస్తరించడంలో శాఖమూరి అప్పారావు మోడం బాలకృష్ణాలు పటేల్ సుధాకర్ రెడ్డిలు తమ జీవితాన్ని విప్లవ ఉద్యమం కోసం తుది శ్వాస ఉన్నంతవరకు పీడిత తాడిత ప్రజల వైపు నిలిచారు. ఈ ముగ్గురి జ్ఞాపకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మెతుకు లేని మెదక్ జిల్లాలో విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించి ఇంతింతై వటుడింతై విప్లవ ఉద్యమానికి అగ్రశ్రేణిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ముషీరాబాద్ జైళులో ఈ ముగ్గురు ఉంటూనే జైళ్ల అధికారులతో గానీ స్నేహపూర్వకంగానే మెదిలారు.జైల్లో మాన్యువల్ బ్రిటిష్ నాటి కాలం చెందిన మాన్యువల్ను మార్చాలి అంటూ ఉరిశిక్షలకు వ్యతిరేకంగా క్షమాభిక్షల కోసం ఖైదీల విడుదల కోసం వీరు చేసిన పాత్ర మరువలేనిది. ఆవేశంలో నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీల కోసం వారి మార్పు కోసం వీరి ఉపన్యాసాలు ఎంతో ప్రభావితం చేశాయి. ప్రస్తుతం పటేల్ సుధాకర్ రెడ్డి శాఖమూరి అప్పారావు మేడం బాలకృష్ణాలు విప్లవ ఉద్యమంలో అసువులు బాసిన వారి అమరత్వం ఆయుధమై సామ్రాజ్య వాదానికి దోపిడి పీడనాలకు వ్యతిరేకంగా సవాలు విసిరింది. జైళ్లలో ఏళ్లకు ఏండ్లు క్షమాభిక్షలు రాక ఎంతోమంది ఖైదీలు జైలు నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న వారి కోసం అప్పటి ప్రభుత్వాలను మెడలు వంచి రాజకీయ ఖైదీల హక్కులను సాధించడంలో వీరి పాత్ర మరువలేనిదని అంటారు.మోడం బాలకృష్ణ ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు ఉన్నాయని వయసు మీద పడి వయోభారంతో బాధపడుతున్న సుధాకర్ మోడం బాలకృష్ణ ను పట్టుకొని హింసించి కాల్చి చంపారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మృతి చెందిన బాలకృష్ణ (60 ) అలియాస్ మనోజ్, బాలన్న, రామచందర్, భాస్కర్. ఆయన తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండకు చెందినవాడు. హైదరాబాద్లో చదువుతూ ఉద్యమ బాట పట్టాడు.మోడెం వెంకటయ్య, మల్లమ్మ దంపతులకు బాలకృష్ణ జన్మించారు. వారి తండ్రి వెంకటయ్యకు పోస్టుమ్యాన్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ ఏరియాకు సుమారు 50 ఏళ్ల కిందటే మకాం మార్చారు. బాలకృ ప్లకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 1983లో మావోయిస్టు (పీపుల్స్ వార్) పార్టీ పట్ల ఆకర్షి తుడైన బాలకృష్ణ.. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పోరుబాట పట్టారు. కొంత కాలం రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్ఈయూ) జంట నగరాల బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగారు.
1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన, పీపుల్స్ వార్ పార్టీ పనిలో భాగంగా అడవినుంచి బయటకు వచ్చిన బాలకృష్ణను అప్పటి యాంటీ నక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు 1993లో అరెస్టు చేశారు. పోలీసు డీఐజీ కేఎస్ వ్యాస్ హత్య, ఎమ్మెల్యే కిడ్నాప్లతో పాటు బెంగళూరు ఆయుధాల స్వాధీనం, కుట్ర కేసులలో ఆయన సుమారు ఆరేళ్ల పాటు ముషీరాబాద్ జైల్లోనే ఉన్నారు. 1999లో బెయిల్పై విడుదలైన ఐదు రోజులకే కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వినకుండా తిరిగి అడవిబాట పట్టారు. సుమారు 26 సంవత్సరాలు ఏవోబీలో వివిధ కేడర్లలో పని చేశారు.ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మారారు. ఆయనపై మూడు రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏ ప్రకటించిన దానితో కలిపి రూ.2 కోట్ల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ పేరిట గత కొంతకాలంగా ప్రత్యేక పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ నిర్మా ణంలో భాగంగా ఇతర నాయకులు, దళాలతో కలిసి బాలకృష్ణ ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహ ద్దులో సంచరిస్తున్నట్లు కేంద్ర బలగాల నుంచి సమాచారం అందింది. ఈ మేరకు కూం బింగ్ చేపట్టగా ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.బాలకృష్ణ 2008లో ఒడిశాలోని నయాగఢ్ దాడికి మాస్టర్‌మైండ్, అందులో 14 మంది (13 పోలీసులు సహా) మరణించారు, ఆయుధాగారం దోచుకున్నారు. అదే ఏడాది బాలిమేలా రిజర్వాయర్ బోట్ దాడిలో 37 మంది గ్రేహౌండ్ కమాండోలు మరణించారు. మృతుల్లో మరో సీనియర్ మావోయిస్టు ప్రమోద్ (ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు, KKBN డివిజన్ సెక్రటరీ) కూడా ఉన్నాడు. ఆయనపై రూ.20 లక్షల రివార్డు ఉంది. మిగతా మృతుల గురించి పూర్తి వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు.ఈ ఆపరేషన్‌లో 26 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు, కానీ నిర్దిష్ట వివరాలు అందుబాటులో లేవు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌పై సంతోషం వ్యక్తం చేశారు. "ఎర్ర టెర్రర్ (నక్సలిజం) మార్చి 31, 2026లోగా పూర్తిగా తుడిచివేయడం ఖాయం" అని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో 241 మంది నక్సలైట్లు మరణించారని పేర్కొన్నారు.ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు, ముఖ్యంగా ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో. ఒడిశా పోలీసులు కూడా ఈ ఘటన తర్వాత నువాపడాలో కాంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు.