నంగునూరు,ఆగస్టు 08(అవనివిలేకరి)నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంటలకు యూరియా కావాల్సిన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. కాగా శుక్రవారం నంగునూరు మండలంలోని పాలమాకుల పిఎసిఎస్ కార్యాలయం ముందు రైతులు ఉదయం నుండే క్లూ లైన్లో నిల్చున్నారు. కాగా ఒక్కో రైతుకు ఒకటి లేదా రెండు యూరియా బ్యాగులు ఇవ్వడంతో చేసేది లేక తీసుకెళ్తున్నారు. నాలుగైదు గంటల పాటు రైతులు క్యూలైన్ లో నిలబడి ఓపిక లేక తమ చెప్పులను లైన్ లో పెడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒకచోట యూరియూ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా కొంతమంది రైతులకు మాత్రమే యూరియా లభించడంతో అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు