Latest News

యూరియా కోసం రైతుల పడిగాపులు..

21 Aug, 2025 74 Views
Main Image
యూరియా కోసం రైతుల పడిగాపులు.. 
సిద్దిపేట అర్బన్,ఆగస్టు21 (ఆవని విలేకరి)యూరియా కొరత రైతుల పాలిట శాపంగా మారింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నా కేవలం ఒక బస్తా మాత్రమే యూరియా లభిస్తుందని, ఇది తమకు దేనికి సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.పది ఎకరాలు ఉన్న రైతుకు ఒక ఎకరా ఒక యూరియా బస్తా ఇస్తే ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా తమ కష్టాల నుంచి గట్టెక్కించాలని,  రైతులందరికీ సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు.ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.