Latest News
రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
08 Aug, 2025
74 Views
సిద్దిపేట,ఆగస్టు 08(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాఖీ పౌర్ణమి రక్షా బంధన్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని ఆప్యాయతను పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగను అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. అక్కతమ్ముళ్ల, అన్నా చెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని.. సోదరుడు సోదీరిమణుల అనురాగానికి సంకేతమైన ఈ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.