రాజీవ్ రహదారిపై రైతుల ధర్నా ,ఆందోళన, రాస్తారోకో..
సిద్దిపేట,ఆగస్టు 19(అవనివిలేకరి)రైతులకు ఎరువులు కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా సిద్దిపేట - కరీంనగర్ రాజీవ్ రహదారి ఇబ్రహీంనగర్ వద్ద రోడ్డు పై బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు బైఠాయించి దర్నాచేశారు. సిద్దిపేట నియోజకవర్గం నాయకులు,కార్యకర్తలతో పాటు రైతులుభారీగా తరలి వచ్చారు. సీఎం డౌన్ డౌన్, రైతులకు సక్రమంగా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.