Latest News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11 Sep, 2025 196 Views
Main Image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 


చిన్నకోడూరు,సెప్టెంబర్ 11(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ సమీపంలో గల రంగనాయక సాగర్  వద్ద  బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నంగునూరు మండలం నర్మెట్ట గ్రామానికి చెందిన విజ్జగిరి లక్ష్మణ్ (45) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. విజ్జగిరి లక్ష్మణ్  బంధువుల ఇంటికి చంద్లాపూర్ కి వెళ్లి బుధవారం రాత్రి తిరిగి మోటార్ సైకిల్ పై నర్మెటకు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గురువారం తెల్లవారుజామున అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు చూసి 108 కు సమాచారం అందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం  సాయంత్రం  చనిపోయారు. మృతుడు లక్ష్మణ్ కు బార్య,కూతురు,కుమారుడు ఉన్నారు.