రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అప్పులు, పన్నులు.
- హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే
సిద్ధిపేట, ఆగస్టు 15(అవనివిలేకరి)రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం పెరిగిందని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పన్నులు దించితే.. రేవంత్ రెడ్డి పెంచుతున్నారని చెప్పారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని ఒక వైపు శాసనసభలో చెబుతూ, మరోవైపు పన్నులు పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో ఉందని, వరసగా రెండో నెల ఆర్థిక మాంద్యం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో వరసగా ఆర్థిక మాంద్యం కొనసాగడం ఇది రెండో సారి అని పేర్కొన్నారు.పాలనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. ప్రభుత్వం రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తోందన్నారు. గత నెల, ఈ నెలలో రవాణా శాఖలో ప్రజలపై రూ.రెండు వేల కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు.
గతంలో ఉన్న రో.100 సర్వీస్ టాక్స్ ను రూ
200 లు చేశారని చెప్పారు. వాహన సర్వీస్ టాక్స్, రోడ్ టాక్స్ పెంచారని చెప్పారు.
మోటార్ సైకిల్ టాక్స్ ను నాలుగైదు వేలకు పెంచారని తెలిపారు. గత నెలలో పెనాల్టీల పేరిట రూ. వెయ్యి కోట్లు, ఈ నెల రూ. వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారం ప్రజలపై వేశారని చెప్పారు. గతంలో రూ. 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే గతేడాది రూ.6900 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమే దీనికి కారణమన్నారు. బడ్జెట్ లో రూ.8,000 కోట్లు అంచనా వేశారు.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో ఇదేలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.అసెంబ్లీలో చెబుతున్న మాటలకు విరుద్ధంగా అన్ని పన్నుల పెంచారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రవాణా శాఖలో టాక్స్ లు రద్దు చేసినట్లు చెప్పారు. దీనివల్ల పేదలకు సాయం చేశామన్నారు. పేదలపై ప్రభుత్వం వేస్తున్న ఈ పన్నుల భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. సీ ఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు
బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పన్నులు తొలగిస్తే.. గ్రేస్ ప్రభుత్వం పన్నులు వేస్తున్నదని.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండగలు వస్తె పాపంగా మారిందన్నారు. పండగకు ముందు, తరువాత వారం రోజులు ఆర్టీసీ ఛార్జీలు రెట్టింపు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంపదను ప్రజలకు పంచుడు బందు చేసి, పెంచుడు ప్రారంభించిందని విమర్శించారు. ఇప్పటికే మద్యం ధరలను రెండు సార్లు పెంచారని తెలిపారు. ప్రతి గ్రామానికి మద్యం దుకాణాలను తెరుస్తామంటున్నారని పేర్కొన్నారు.భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేద ప్రజల రక్తమాంసాలు పీలుస్తారా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి డబ్బుల సంచులు మోయడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు పాల సాయిరామ్,మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి,అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.