Latest News
రైతుల హృదయం పై చెరగని సంతకం కాళేశ్వరం ప్రాజెక్ట్
19 Aug, 2025
100 Views
రైతుల హృదయం పై చెరగని సంతకం కాళేశ్వరం ప్రాజెక్ట్
సిద్దిపేట, ఆగస్టు 19(అవనివిలేకరి)రైతుల హృదయం మీద చెరగని గొప్ప సంతకం..కాళేశ్వరం ప్రాజెక్టు అని సిద్ధిపేట, నంగునూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నంగునూరు మండల శాఖ అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, నంగునూరు పీఏసీ ఎస్ ఛైర్మన్ కోల రమేశ్ గౌడ్, బీఆర్ఎస్ శ్రీహరి యాదవ్, ఈర్షద్, పిండి యాదగిరి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి విడుదల కోసం హరీశ్ రావు లేఖ రాస్తే నీళ్లు విడిచారని చెప్పారు.హరీశ్ రావు ఒత్తిడి భరించలేక ప్రభుత్వం మొక్కుబడిగా మోటార్ ఆన్ చేసిందన్నారు.మొక్కుబడిగా కాకుండా జిల్లాల్లోని రిజర్వయర్ల నీటి సామర్ధ్యం మేరకు నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు.మూడు పంప్ లు ఆన్ చేయకుండా కేవలం ఒక్క పంప్ ఆన్ చేశారని పోపోయారు. ఒక్క పంపుతూ 71 టీఎంసీ నీటిని నింపడానికి ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా మూడు పంపు లు ఆన్ చేయాలని కోరారు. గోదారి నీళ్లు సముద్రం పాలు కాకుండా చూడాలని చెప్పారు.బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేయాలనే ఆలోచన మాని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్లు విడవాలన్నారు. రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుంటే ప్రభుత్వం కాలగర్భంలో కలవడం ఖాయం అన్నారు. భేషజాలకు పోకుండా నీళ్లు ఇవ్వాలి..మొక్కుబడిగా వద్దని చిత్తశుద్ధితో పని చేసి రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. మిగిలిన పంపులను ఆన్ చేయకుంటే రైతులతో కలిసి వెళ్లి మూడు పంపులను తామే ఆన్ చేస్తామన్నారు .మల్లన్న సాగర్లోకి నీళ్లు వస్తే గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక, మెదక్, సిరిసిల్ల నియోజక వర్గాలకు సాగునీరు అందుతుందన్నారు.