రహదారి వంతెనలను పరిశీలించిన కలెక్టర్
నంగునూరు, ఆగస్టు 17(అవనివిలేకరి)నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, బద్దిపడగ గ్రామాల్లో రహదారి వెంట వాగులపై ఉన్న రోడ్డు వంతెనలను ఆదివారం జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధిక వర్షాలు కురిసి నీరు వంతెనలపై నుండి నీరు వెళితే తీసుకోవలసిన చర్యలపైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాతావరణ శాఖ సూచించిన విధంగా అధిక వర్షపాతం నమోదయ్య అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వంతెనపై నుండి నీరు వెళితే ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు. ప్రజల ప్రాణాల దృష్ట్యా వంతెనల వద్ద పోలీస్ పికెటింగ్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వరదలు వచ్చినపుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వంతెనల కింద, కాలువల్లో చెత్తా చెదారం తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.