Latest News

లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్లు తప్పనిసరి.

08 Aug, 2025 65 Views
Main Image



లైంగిక చర్యలకు సమ్మతి వయసు 18 ఏళ్లు కంటే తక్కువ చేయడం ప్రమాదకరం. 16 ఏళ్లకు తగ్గించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనను కేంద్రం తోసిపుచ్చింది.అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి తెలిపిన ప్రకారం, ఈ పరిమితి తగ్గితే బాలలపై నేరాలు, అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉంది. పోక్సో చట్టం కౌమారదశలో ఉన్నవారి రక్షణకే ఉద్దేశించినదని, వయోపరిమితి తగ్గించడం చట్టవ్యతిరేకమని కేంద్రం పేర్కొంది.ఇందిరా జైసింగ్ అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత చట్టం 16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలను నేరంగా చూపుతుందని, ఇది కౌమారదశ యువత హక్కులను ఉల్లంఘిస్తోందని తెలిపారు.లా కమిషన్, పోక్సో చట్టం ప్రకారం, 18 ఏళ్లు సమ్మతి వయసుగా కొనసాగించడమే సరైందని గతంలోనే స్పష్టం చేసింది.