Latest News

లంచం తీసుకున్న హౌసింగ్ ఏఈ కే. వెంకయ్య సస్పెండ్

22 Aug, 2025 212 Views
Main Image
హౌసింగ్ ఏఈ  కే. వెంకయ్య సస్పెండ్ 
సిద్దిపేట, ఆగస్ట్ 22(అవనివిలేకరి)ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న మేస్త్రి నుండి డబ్బులు డిమాండ్ చేసిన అవినీతి అధికారి సిద్దిపేట రూరల్ మండల  హౌసింగ్ ఏఈ  కే. వెంకయ్యను  విధుల నుండి సస్పెండ్ చేస్తూ  జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం  హౌసింగ్ ఏఈ కే.వెంకయ్య సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ  ఇండ్లను నిర్మిస్తున్న మేస్త్రీ చింతల వెంకటయ్యను  ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడానికి   డబ్బులు డిమాండ్ చేశారు. 'ఇందిరమ్మ ఇండ్లలో అధికారుల చేతివాటం'  అనే శీర్షికతో  20 ఆగస్టు 2025 నాడు దినపత్రికల ద్వారా ఈ విషయం జిల్లా కలెక్టర్ కే.హేమావతి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన  సిద్దిపేట జిల్లా పరిషత్ సీఈఓ రమేష్ ను ఎంక్వయిరీ అధికారిగా నియమించగా 20 ఆగస్టు 2025 తేదీనాడు వెంకటాపూర్ గ్రామపంచాయతీలో  మండల పంచాయతీ అధికారి మరియు పంచాయతీ సెక్రెటరీ  ల సమక్షంలోఎంక్వయిరీ చేశారు. జెడ్పి సీఈఓ రమేష్ విచారణ చేసి హౌసింగ్ ఏఈ కె.వెంకయ్య ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న మేస్త్రీని  డబ్బులు డిమాండ్ చేసింది వాస్తవమని  50వేల రూపాయలు డిమాండ్ చేయగా 5000 రూపాయలను మేస్త్రీ చింతల వెంకటయ్య  హౌసింగ్ ఏఈ కే.వెంకయ్యకు  ఇచ్చినట్టు  జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా  సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి సిద్దిపేట రూరల్ హౌసింగ్ ఏఈ కే.వెంకయ్యను విధుల నుండి సస్పెండ్ చేస్తూ  శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.