సిద్దిపేట, ఆగస్టు 7(అవనివిలేకరి)విద్యార్థులు తమకిష్టమైన రంగంలో సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ విద్యాశాఖ, జిల్లా జౌళి శాఖల సౌజన్యంతో విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అయా పోటీలలో విజేతలైన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హైమావతి బహుమతులు అందజేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. బక్రి చెప్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎండిన సంకటి సిరి చందన(9వ తరగతి) వ్యాస రచనలో జిల్లా స్థాయి ప్రథమ బహుమతిని, దుగ్యాని చైతన్య (పదవ తరగతి) ఉపన్యాస పోటీలలో ద్వితీయ బహుమతి ని పొందారు. ఈ సందర్భంగా ఇది చెప్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారం నాగేందర్ రెడ్డి, గైడ్ టీచర్ మామిడి పూర్ణచందర్ రావు సమక్షంలో బక్రి చెప్యాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు, బహుమతులను అందించారు. సందర్భంగా వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు.