Latest News

వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

26 Aug, 2025 43 Views
Main Image
మట్టి గణపతే మహా గణపతి..వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి..
- విఘ్నేశ్వరుని దయతో అన్ని విఘ్నాలు తొలగాలి.
-  మనం ప్రకృతిని ప్రేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు.  మనం ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.
- వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి.
- వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు..
- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు 
సిద్దిపేట,ఆగస్టు 26(అవనివిలేకరి) జిల్లా ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని చెప్పారు. విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు.  విగ్నేశ్వరుని దయతో ఎలాంటి విఘ్నాలు రాకుండా  నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ విగ్నేశ్వరుణ్ణి ప్రార్ధించారు. ప్రతి ఒక్క ఇంటిలో మట్టి గణపతి ప్రతిమ ను పూజించాలన్నారు. మట్టి గణపతి పూజించడం ఎంతో శ్రేష్టమని " మట్టి గణపతే మహా గణపతి " అని చెప్పారు. వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి. మనం ప్రకృతిని పేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు. మనం ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.  పర్యావరణాన్ని పరిరక్షణ తో దేవుణ్ణి పూజించాలని పిలుపునిచ్చారు. అదేవిదంగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద యువత, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ లైన్ ల విషయం లో, చెరువు ల్లో నిమర్జనం చేసే సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.