Latest News

విప్లవ నినాదాలు, ఆట,పాటలతో కొనసాగిన నక్సలైట్ వెంకట్ శవయాత్ర

15 Sep, 2025 89 Views
Main Image
విప్లవ నినాదాలు, ఆట,పాటలతో కొనసాగిన నక్సలైట్ వెంకట్ శవయాత్ర
బెల్లంపల్లి, సెప్టెంబర్ 15(అవనివిలేకరి)నాలుగురోజుల  క్రితం గరియాబాద్ ఎన్కౌంటర్లో10 మంది నక్సలైట్లు చనిపోగా అందులో ఒకరైన మావోయిస్టు పార్టీ ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు  జాలి వెంకట్ శవాన్ని అతని స్వగ్రామం బెల్లంపల్లి మండలం సండ్రవెల్లి గ్రామానికి తీసుకొచ్చి విప్లవ నినాదాలు చేస్తూ వెంకట్  ప్లెక్సిని పాలు,నీటితో కడిగి అడుగడుగున గ్రామ ప్రజలు విప్లవ నినాదాల మధ్యన శవయాత్ర కొనసాగించారు. ప్రజల కోసం పనిచేసే క్రమములో కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టు పార్టీని నాయకులను కార్యకర్తలను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలతో దాడులు చేస్తున్నదని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మండలం సండ్రవెల్లి గ్రామానికి చెందిన ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు జాలి వెంకట్ చివరి చూపు కొరకు కొరకు ఒరిస్సా రాష్ట్రం కు ఆ గ్రామ ప్రజలు వెళ్లి  శవాన్ని గ్రామానికి తీసుకువచ్చి, కరీంనగర్ అదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు ఘనంగా అంతిమయాత్రను నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు అంతిమయాత్ర ముందు ఎవరి ఇంటి ముందు వారు నీటితో,రాష్ట్రప్రభుత్వాల పాలతో అమరుని ఫ్లెక్సీనీ శుభ్రం చేసి పిడికిలెత్తి నినాదాలు చేస్తూ అమరవీరుని ఆశయాలను కొనసాగిస్తామని శపథం చేశారు.