Latest News

షాడో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఎంపీ.

26 Aug, 2025 59 Views
Main Image
షాడో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఎంపీ.
రేవంత్ రెడ్డిని తిట్టడు, తిట్టనియ్యడు
బీజేపీ, కాంగ్రెస్ రెండు రెండే
యూరియా సరఫరా లో వైఫల్యం..
 భవిష్యత్తు లో మూల్యం తప్పదు
సిద్దిపేట,ఆగస్టు 26(అవనివిలేకరి)బీజేపీ ఎంపి గా రైతుల ఇబ్బందులు తీర్చాల్సిన ఎంపీ కాంగ్రెస్ పార్టీ  షాడో అధికార ప్రతినిధి  లెక్క సీఎం రేవంత్ రెడ్డిని తిట్టకుండా చూస్తున్నాడని బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి,  నాయకులు సారయ్య, సోమిరెడ్డి, కొండం  రవీందర్ రెడ్డి, అరవిందరెడ్డి లు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మాట్లాడారు... ఎరువుల అంశంపై మంత్రుల వ్యాఖ్యలు చూస్తే ప్రభుత్వం చేతులు ఎత్తిసేనట్టుగా ఉందని గతంలో కేసీఆర్ హయాంలో ముందస్తు ప్రణాళికలు ఉండేవి..రైతులకు యూరియా సమస్య రాకుండా10 ఏండ్లు చూశారు ఎండాకాలం లొనే సమీక్షలు జరిగేవని, బఫేర్ స్టాక్ అందుబాటులో ఉండేదికేసీఆర్, మంత్రులు స్వయంగా పర్యవేక్షణ చేసేవారు.. ఢిల్లీలో రివ్యూ చేసి యూరియా తెచ్చేవారు. రైతుల పట్ల కేసీఆర్ కు ప్రేమ ఉంది కాబట్టి తాపత్రయ పడ్డారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది.. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డిని ఒక్క మాట అననిస్తాలేదు బీజేపీ పార్టీ రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీ అన్న విషయం మర్చిపోయిందని ఏద్దేవా చేశారు.. బీజేపీ ఎంపీ యూరియా తేవడం లో ఫెయిల్ అయ్యాడని,  రైతుల కోసం బీఆర్ ఎస్ పోరాటం చేస్తుంటే బీజేపీ నిమ్మకునిరెత్తనట్టుగా ఉందని మండి పడ్డాడు. యూరియా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామనే హామీ ఇప్పటికి లేదని బీజేపీ పార్టీ ని కూడా నిలదిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని యూరియా సమస్య చాలా ఉంది. రైతులు రోడ్డు ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జిల్లా యంత్రాంగం వైఫల్యం చెందింది. మంత్రులు, అధికారులు విఫలం చెందారు..జిల్లా మంత్రి ఎక్కడ ఉన్నాడు. స్పందన లేదు జిల్లాకు రావాల్సిన కోటా ఎక్కడ.. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు.. అయిన ప్రభుత్వం లో స్పందన లేదు.. యూరియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది భవిష్యత్తు లో తగిన గుణపాఠం తప్పదు హెచ్చరించారు.. ఈ సమావేశం లో ప్యాక్స్ చైర్మన్ కోల రమేష్, కౌన్సిలర్ అరవింద్ రెడ్డి, మాజి సర్పంచ్ ఆంజనేయులు, పర్శరాములు, సీనియర్ నాయకులు పొన్నమల్ల రాములు, విద్యార్థి యువ నాయకులు యాదగిరి, ఆకుబత్తిని రాము, రవి, రమేష్, సాయి, ఇమ్రాన్, చంటి, నరేందర్ తదితరులు ఉన్నారు.