సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.
కొండపాక సెప్టెంబర్ 8 (అవని విలేఖరి) సీఎం సహాయనిధి పేదలకు ఒక వరంలాం టిదని దుద్దెడ తాజామాజీ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజ అఖిల్ యాదవ్ లు పేర్కొన్నారు. శనివారం దుద్దెడ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను సాలేంద్రి నరేష్ రూ. 60,000, గొడుగు మల్లయ్య రూ. 21,500 లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ.. వివిధ అనారోగ్య కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ము మల్లికార్జున్ మాదిగ, పంజా చిరంజీవి, ఆరేపల్లి శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాకీ రాజశేఖర్, గొడుగు రాజు పాల్గొన్నారు.