స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.
- అంజిరెడ్డి, ఎమ్మెల్సీ
నంగునూరు, ఆగస్టు 28(అవనివిలేకరి)స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతం చేయాలని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. నంగునూరులో పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఖానాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చౌడుచర్ల వెంకట రాంరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పరకాల తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు గంధం పరమేశ్వర్ రెడ్డి, రజనీకర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పప్పు సురేందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, రజనీకర్, సతీశ్ ,రాంరెడ్డి, కిషన్, యాదయ్య, భాస్కర్, పరమేశ్వర్, కృష్ణ ప్రసాద్, అజయ్, అంబదాసు, రామ్ ప్రసాద్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.