Latest News

సిద్దిపేటలో నీట మునిగిన కాలనీలను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమీషనర్.

28 Aug, 2025 172 Views
Main Image
సిద్దిపేటలో నీట మునిగిన కాలనీలను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమీషనర్.
సిద్దిపేట ఆగస్టు 28(అవనివిలేకరి) సిద్దిపేటలో బుధవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలో నీట మునిగిన పలు కాలనీలను గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాధ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కొత్త బస్టాండ్ నుండి మోడ్రన్ బస్టాండ్ మద్యలో రోడ్ వెంబడి బ్రిడ్జి పైన నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి నీటి ఉధృతి తగ్గేవరకు రాకపోకలు నిలిపివేయాలని పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.శ్రీనగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని ఒక ప్రవేట్ అపార్ట్మెంట్ పైన నుంచి వీక్షించి నీటమునిగినన కాలని వాసులను సురక్షిత ప్రాంతాలను తరలించడం కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రప్పించి పునరావాస కేంద్రాల లోకి మళ్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోమటిచెరువు మత్తడి నుండి నీరు ఉదృతంగా వెళ్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఎన్సాన్పల్లి  నుండి కోమటి చెరువు నీరు వచ్చే బ్రిడ్జి గుండా కాలువనిండ నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే శ్రీచైతన్య స్కూల్ ముందు భాగం లో ఉన్న కల్వర్టు గుండా నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి రోడ్ డ్యామేజ్ అయిన ప్రాంతంలో కోతకు గురికాకుండా ఇసుక బస్తాలు వెయ్యాలని అధికారులకు ఆదేశించారు.శ్రీనివాస్ నగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని,లోహిత్ సాయి ఆసుపత్రి పైనుండి నర్సాపూర్ చెరువు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ కింద ఉన్న నర్సాపూర్ చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి నీరు వేగంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వీరు వెంట ఏసిపి రవీందర్, తహసీల్దార్ కిరణ్, పోలీస్ ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.