Latest News
సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చే విద్యార్థులకు స్పోర్ట్ యూనిఫామ్స్ పంపిణీ
12 Aug, 2025
140 Views
దుబ్బాక ఆగస్టు 12(అవనివిలేకరి)ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, దీంతో నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని సిద్దిపేట జిల్లా విద్య అధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల ఎంఈఓ అంజ గౌడ్ లు అన్నారు.మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సిద్దిపేట జిల్లా సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందించడం జరిగింది.జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను గుర్తించి స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేయడం సంతోషకరమన్నారు.విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఉపాధ్యాయలు బోధిస్తున్న తీరు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది అని వాకబు చేశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలున్నాయా, వసతులపై ఆరా తీశారు.గ్రామంలోని పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని గ్రామస్తులకు సూచించారు. పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనాన్ని అందించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు.సందీప్ హాస్పిటల్ మంచాల శ్రీనివాస్ మాట్లాడుతూ మారు మూల ప్రాంతం లో ఉన్న పాఠశాల విద్యార్థులకు సేవ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదగాలని సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా విద్యాధికారికి, మండల విద్యాధికారికి అలాగే సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మంచాల శ్రీనివాస్,గ్రామ ప్రజాప్రతినిధులకు బొకేలు ఇచ్చి చేనేత టవల్స్ తో సన్మానించారు.అలాగే ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులను ముందస్తుగా గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బట్టికాడి స్వామి గౌడ్ జిల్లావిద్య అధికారి చేతుల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మంచాల శ్రీనివాస్,ప్రధాన ఉపాధ్యాయులు కుమార స్వామి,ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి,కవిత,రెను మానస,మాజీ సర్పంచ్ పన్యాల వెంకట్ రెడ్డి,మాజీ ఎంపిటిసి బాల మల్లేశం గౌడ్,గ్రామ పెద్దలు బాల గౌడ్,అంజ గౌడ్,ఇరమైన నర్సింలు,స్వామి తదితరులు పాల్గొన్నారు.