Latest News
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 4వ సారి మంద పవన్ ఎన్నిక
23 Aug, 2025
45 Views
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 4వ సారి మంద పవన్ ఎన్నిక
రాష్ట్ర సమితి సభ్యులుగా కనుకుంట్ల శంకర్,కొమ్ముల భాస్కర్ లు ఎన్నిక.
సిద్దిపేట అర్బన్,ఆగస్టు 23(అవని విలేకరి)ఈ నెల 20 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా గాజుల రామరాం లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 4వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయనతో పాటు సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు కనుకుంట్ల శంకర్,కొమ్ముల భాస్కర్ లు నూతన రాష్ట్ర సమితిలో రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో నాలుగోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు మిగతా రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక విప్లవ వందనాలని,పార్టీ బలోపేతం కోసం,పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తామని, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిపిఐ పార్టీగా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు రాష్ట్ర సమితి సభ్యులు కనుకుంట్ల శంకర్, కొమ్ముల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర సమితిలో అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పార్టీకి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కి తమ ఎన్నికకు సహకరించిన సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ కు ధన్యవాదాలు తెలుపుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్మాణ బలోపేతం కోసం నిరంతరం తమ వంతు బాధ్యతగా నిర్విరామంగా కృషి చేస్తామని భవిష్యత్తులో ఈ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.