వచ్చే సెప్టెంబర్ మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో వెల్లడించవచ్చు . ముందుగా పార్టీల గుర్తులతో నిర్వహిచే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను పూర్తి చేసి తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తారు. బిసి రిజర్వేషన్ విషయంలో స్పష్టత రాకపోయిన తమ పార్టీ పరంగా బిసిలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎట్టి విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పొడగించేదిలేదని సీఎం అన్నట్టు తెలుస్తుంది.