Latest News

సబ్ జైలర్ సస్పెండ్

24 Aug, 2025 47 Views
Main Image



 సబ్ జైలర్ సస్పెండ్


నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళా ఖైదీ సుచరిత మృతి చెందిన ఘటనలో నర్సంపేట సబ్ జైలర్ లక్ష్మీ శృతిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన సుచరితను నర్సంపేట మహిళా జైలుకు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 21న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.