సిద్దిపేట, ఆగస్టు 13(అవనివిలేకరి) ఒక సాధారణ ఉపాధ్యాయుని నుండి అంతర్జాతీయ స్థాయి వేదికలో పాల్గొనే అవకాశం సిద్దిపేట లయన్స్ క్లబ్ కల్పించిందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్
నాథ్ రావు అన్నారు. సిద్దిపేట లయన్స్ క్లబ్ 53వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా భావనతో లయన్స్ క్లబ్ పనిచేస్తుందన్నారు. ఈ సంవత్సరం వినూత్న కార్యక్రమాలతో సేవలను విస్తరించాలని నిర్ణయించడం జరిగిందని, సభ్యులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలన్నారు. మన జిల్లా క్లబ్ 210 దేశాలలోని 750 జిల్లాల్లో మెంబర్షిప్ లో ఆరవ స్థానంలో, తెలంగాణలోని అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండడం శుభసూచకంగా ఉందన్నారు. తొమ్మిది రోజులలోనే తొమ్మిది నూతన క్లబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దిల్ సే అనే నినాదంతో లయన్స్ క్లబ్ 320డి ఈ సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో రైతుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి రైతులను సన్మానించడం జరుగుతుందన్నారు. నూతన సభ్యులు కూడా మరికొందరిని క్లబ్ లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లయన్ సూర్యా రాజ్ మాట్లాడుతూ లయన్స్ సేవలను విస్తరించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. నిస్వార్థ సేవతో లయన్స్ ముందుకు సాగాలన్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వినోద్ మోదాని, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా చందు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే క్లబ్ లో నూతనంగా చేరిన పదిమంది సభ్యులను అభినందించి వారిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు గంప రమేష్, శ్రీనివాస్, లయన్ ప్రతినిధులు ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, సంజయ్, శ్రీధర్, కొమురవెల్లి శేఖర్, రమేష్, వైకుంఠం, జె జె నాథ్, జ్యోతి, జోజి, సురేష్ కుమార్, భగవాన్, రాజ బహదూర్ రెడ్డి, కాశీనాథ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, కిషోర్, వెంకటేశ్వర్ రెడ్డి, రాముని భాస్కర్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.