Latest News
10వేల ఆర్థిక సహాయం చేసిన చక్రధర్ గౌడ్
22 Aug, 2025
29 Views
రూ.10వేల ఆర్థిక సహాయం చేసిన చక్రధర్ గౌడ్
నంగునూరు, ఆగస్టు 22(అవనివిలేకరి)నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన మంకి యాదయ్య మూడు రోజుల కిందట గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గాదగోని చక్రధర్ గౌడ్ తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ డబ్బులను గోనెపల్లి శివప్రసాద్ గౌడ్ ద్వారా పంపించారు. ఈ మేరకు శుక్రవారం గోనెపల్లి శివప్రసాద్ గౌడ్ మంకి యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి డబ్బులను అందించారు. ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మంకి యాదయ్య కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో గడ్డం సాయి శ్యామ్, నీల రాకేశ్, ఎడ్ల అఖిల్, నీల చందు, దండు రాజు, బడే అజయ్, రఘువరన్, భాను, సంతోష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.