25న హైదరాబాద్ లో జరిగే బీసీల సత్య గ్రహ దీక్షను విజయవంతం చేయాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన గొర్ల కార్యదర్శి అయిలేష్ యాదవ్
సిద్ధిపేట, ఆగస్టు 22(అవనివిలేకరి)ఈ నెల 25 న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీల సత్య గ్రహ దీక్షను విజయవంతం చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన గొర్ల కార్యదర్శి అయిలేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారోజు రత్నయ్య లు అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో వారు మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగే బీసీల సత్యాగ్రహ దీక్ష కు వేలాదిగా తరలి రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీ సోదరులందరు సత్యాగ్రహ దీక్ష కు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లగిశెట్టి అశోక్ ను నియమిస్తున్నట్లు అయిలేష్ తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బంక చిరంజీవి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి అశోక్ యాదవ్, నాయకులు బత్తుల మల్లేశం, పి.మల్లేశం, దండబోయిన రాజు, సత్యం ముదిరాజ్, స్వామి, కిరణ్, పులి నర్సయ్య పాల్గొన్నారు.