Latest News

7న గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ సభను జయప్రదం చేయండి.

05 Sep, 2025 60 Views
Main Image
7న గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ సభను జయప్రదం చేయండి. 
రాయపోల్ సెప్టెంబర్ 05(అవనివిలేకరి)ఈనెల ప్రజ్ఞాపూర్ లో ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగే గజ్వేల్ ప్రెస్ క్లబ్ 25 ఏళ్ల రజతోత్సవ సభను విజయవంతం చేయాలని గజ్వేల్ ప్రెస్ క్లబ్ సభ్యులు గల్వ మహేందర్ రెడ్డి. లక్ష్మీనారాయణ గౌడ్,నాగ వెంకట్ రెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోమాట్లాడుతూ గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఏర్పడి ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభ వేడుకలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈనెల 7న ప్రజ్ఞాపూర్ లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగే రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఇరవై ఐదు సంవత్సరాల పాటు గజ్వేల్ ప్రెస్ క్గబ్ చేపట్టిన అనేక సామాజిక. ప్రజా ఉద్యమాలతో పాటు ప్రజల పక్షాన ఎన్నో వార్త కథనాలు రాసి ప్రజల హృదయాల్లో నిలిచిన ఎంతోమంది జర్నలిస్టు ఉన్నారని గుర్తు చేశారు.నాటి జర్నలిస్ట్ ల పాత్ర గురించి రజతోత్సవ సభ వేడుకలో వక్తలు ప్రసంగించడం జరుగుతుందని వారు గుర్తు చేశారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఏర్పడి ఇరువై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ రజతోత్సవాల కార్యక్రమానికి టి యు డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అల్లితో పాటు పలువురు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ  కార్యక్రమానికి యువత. ఉద్యోగులు. ఉపాధ్యాయలు. కార్మికులు. కళాకారులు. ప్రజా ప్రతినిధులు తరలివచ్చి జయప్రదం చేయాలని పేర్కొన్నారు.